ముద్ర : కాప్రా
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ ఏఎస్ రావు నగర్ కాప్రా డివిజన్ల ఆధ్వర్యంలో నేతాజీ నగర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌పై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షురాలు తుమ్మల సంధ్య, ఆ పార్టీ సీనియర్ నాయకులు రోహిన్,అంబటి వెంకటాచలం, రజినీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
అదేవిధంగా, కేంద్ర నిధులతో నిర్మాణంలో ఉన్న ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని హెచ్చరించారు. అభివృద్ధి అంశాలపై రాజకీయాలు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.
ఈ నిరసన కార్యక్రమంలో కాప్రా డివిజన్ అధ్యక్షుడు శాంతి కిరణ్, సీనియర్ నాయకులు, సోమేశ్ నాయుడు, రాజు యాదవ్, శ్రీధర్ సంపత్ మల్లేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.