- మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య
తుంగతుర్తి, ముద్ర: సంఘ సంస్కర్త.సావిత్రి భాయి పూలె వర్ధంతి సందర్బంగా తుంగతుర్తి మండలకేంద్రంలో నీ సావిత్రిభాయి పూలె విగ్రహానికి మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య తో పాటు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాజం లోని అన్ని వర్గాల మహిళలందరు విద్య నభ్యాసించాలని తలంపుతో పాఠశాలను ఏర్పాటు చేసిన తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిభాయి పూలె అన్నారు.వారి యొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు అందచేయాల్సిన భాద్యత మనందరి పైన ఉందని అన్నారు అన్నారు.సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బి ఆర్ ఎస్ నాయకులు గుండాగానీ రాములు గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు, నరేష్ నాయక్. మాన్సింగ్ నాయక్. యాకు నాయక్. గోపగాని శ్రీనివాస్,మాజీ గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్, నాగమల్లు, మల్లేష్, సాయి కిరణ్, వెంకటేష్,గోపగాని వెంకన్న కడారి దాసు తదితరులు పాల్గొన్నారు