Take a fresh look at your lifestyle.

నర్సింగ్ కళాశాల సందర్శించిన చైర్పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ నర్సింగ్ కళాశాలను మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ శుక్రవారం సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సౌకర్యాలు సమస్యలపై నిరసన తెలిపే కలెక్టర్ దృష్టికి విద్యార్ధినీలు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సూచన మేరకు చైర్ పర్సన్ రాధిక సందర్శించి విద్యార్థిలతో, కళాశాల సిబ్బందితో మాట్లాడారు.
నర్సింగ్ హాస్టల్లో గల సమస్యలపై చర్చించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.