Take a fresh look at your lifestyle.

మల్కాజిగిరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో 286 మంది పై కేసులు

 

ముద్ర మల్కాజిగిరి

మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్‌లు వీకెండ్‌లో ప్రత్యేక డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించి మొత్తం 286 మందిని పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే (251). బ్లడ్ ఆల్కహాల్ స్థాయిల ప్రకారం ఎక్కువ మంది 36–200 ఎంజీ మధ్యలో ఉన్నారు.
పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరు పరుస్తారు. మద్యం తాగి వాహనం నడపడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించి ప్రమాదం కలిగిస్తే భారతి య న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసి, గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు.
గత వారం (ఏప్రిల్ 5–11)లో 218 కేసులు కోర్టుల్లో పరిష్కరించగా, 30 మందికి జైలు శిక్ష, 2 మందికి ఫైన్‌తో పాటు సామాజిక సేవ, 186 మందికి కేవలం జరిమానా విధించారు.

Leave A Reply

Your email address will not be published.