Take a fresh look at your lifestyle.

చిన్న హనుమాన్ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు

  • జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఈ నెల 11 నుండి 13 వ తేదీ వరకు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పేర్కొన్నారు.జిల్లా ఎస్పి అశోక్ కుమార్, ఆలయ అధికారులతో కలిసి కొండగట్టులో ఏర్పాట్లు కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11 వ తేదీ రాత్రి నుండి 13 వ తేదీ ఉదయం వరకు సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, సుమారు 45 వేల మంది మాల విరమణ చేస్తారని తెలిపారు.ఈ 3 రోజుల పాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల ప్రసాదలను అందుబాటులో జరుగుతుందని పేర్కొన్నారు.ఆలయ ప్రాంగణంలో 64 సి. సి. కెమెరాలు ఉండగా అదనంగా 50 సి. సి. కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 6 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. భక్తులకు ఎక్కడ వైద్య పరంగా ఇబ్బంది జరిగిన వెంటనే రంగంలోకి దిగాలనీ ఆదేశించారు.వైజాగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు. ఇందుకోసం ఒక వేదికను ఏర్పాటు చేసి 100 మంది కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. అలాగే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కొండపైకి వెళ్లేందుకు ఆర్. టి. సి. బస్సులను పెంచాలని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆదేశించారు.భక్తులకు అవసరమైన ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సాఫీగా స్వామివారి దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేసేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయ చేసుకున్నట్లు తెలిపారు.హనుమాన్ భక్తుల నుంచి ఈ ఒక్క ఫిర్యాదు వచ్చిన సంబంధిత అధికారులపై కటిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, డిఎస్పీ., రఘు చందన్, కొండగట్టు ఆలయ ఈ. ఓ. శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.