Take a fresh look at your lifestyle.

వరి పంట బోనస్ రైతు బ్యాంక్ ఖాతాలో వెంటనే జమ చేయాలి

  • వనపర్తి జిల్లా రైతు సంఘము అధ్యక్షులు డి బాల్ రెడ్డి

ముద్ర,వీపనగండ్ల : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరి పంటకు బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు సన్న రకం వడ్ల రోడ్లను విక్రయించిన చాలామంది రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ను రైతుల ఖాతాలో జమ చేయలేదని వెంటనే జమ చేసి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని రైతు సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు డి బాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బొల్లారంలో విలేకరులతో బాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరి పంటకు బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగిందని, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ప్రారంభంలో మాత్రమే10 శాతం రైతులకు మాత్రమే వరి బోనస్ డబ్బులు ఇవ్వడం,90 శాతం రైతులకు ఇప్పటికీ వరి బోనస్ డబ్బులు రాక ఆందోళన గురవుతున్నారన్నారు.కాబట్టి ప్రభుత్వం వెంటనే ధాన్యం విక్రయించిన ప్రతి రైతుకు, వరి బోనస్ డబ్బులు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ కూడా 45 శాతం రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాక ఆందోళనలకు గురవుతున్నారని, రైతు భరోసా మూడు ఎకరాలకు వరకు వేశామని చెప్తున్నారు కానీ ఇప్పటికీ 30% పైగా రైతులకు మూడెకరాల్లో ఉన్న రైతులకు కూడా అందలేదన్నారు. చిన్నంబాయి మండలంలోని చివరి ఆయకట్టు భూములలో సాగునీరు సరిగ్గా అందక పంటలు ఎండిపోతున్నాయని,కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే మాట్లాడి జూరాల ప్రాజెక్టుకు తాగు, సాగునీరు విడుదల చేయించుకుని చివరి ఆయకట్టు రైతులు వరకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం కృష్ణయ్య, సిపిఎం మండల నాయకులు వి కృష్ణయ్య, బాలగౌడ్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.