- తంగడపల్లి వెంకన్న దోపోత్సవం.
- కన్నుల పండువగా లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఊరేగింపు..
- భారీగా తరలివచ్చిన భక్తులు.
చేవెళ్ల ముద్ర విలేకరి : శ్రీ దశావతార సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రాజగోపుర కలశ ప్రతిష్ట కార్యక్రమంలోని భాగంగా ఆరవ రోజు లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి దోపోత్సవం కన్నుల పండువగా జరిగింది.బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం నిత్యము,బలిహరణం, ప్రత్యేకఅర్చనలు పుష్పాభిషేకం, అనంతరం రాత్రి 9గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లి లో లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి దోపోత్సవాన్ని నిర్వహించారు.
దోపోత్సవాన్ని దేవాలయ ప్రాంగణం నుంచి స్వామి వారి మండపం వరకు ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.అలివేలు మంగమ్మను సైతం మండపం వరకు తీసుకొచ్చారు.అనంతరం చెంచు వారి ఆటపాటల మధ్య స్వామి ఆభరణాలు దోచుకున్నారు.దోపోత్సవాన్ని తిలకించేందుకు మండలం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ కార్యక్రమంలోని నడదూర్ వెంకట రాఘవన్, వెంకట నాదాచార్యులు, శేషాద్రి, వేణుమాధవన్, రాజగోపాల్, ఆలయ అర్చకులు ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
