బోథ్, ముద్ర: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామానికి చెందిన యువ నాయకుడు కాంగ్రెస్ వాదిగా బలమైన ముద్ర వేసుకున్న పసుల చంటిని మరోమారు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించింది. ఈమేరకు గురువారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన పేరును ప్రకటించారని పసుల చంటి ఒక ప్రకటనలో తెలిపారు. పసుల చంటి
2018 నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళారు. ఏఐసిసి, పీసీసీ, డిసిసి పిలుపులే కాకుండా స్థానిక సమస్యలపై అనేక పోరాటాలు చేసి విజయం సాధించారు.
తనపై నమ్మకం ఉంచి రెండవసారి ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి, ఇన్నేళ్లు వాళ్ల భుజాల మీద ఎత్తుకొని గుర్తింపు ఇచ్చిన సహచర కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాబూరావు, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post