యాదగిరిగుట్ట. ముద్ర: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రథమ పుత్రిక అరుంధతి జన్మదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులకు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.అనంతరం వారి స్వగృహంలో కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి తన కూతురు అరుంధతి కి కేక్ తినింపించి శుభాకాంక్షలు తెలిపారు.