నవగ్రహ పూజా, సంతాన గోపాల హోమం…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష సంఖ్యలో భక్తులు నవగ్రహ పూజా, సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాలను అందజేసి ఆశీర్వాసనాన్ని అందజేశారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక, నంబి రాం గోపాల చార్య, నంబి సత్యనారాయణ ఆచార్య, నంబి మధుసూదన్ ఆచార్య, నంబి నృసింహ ఆచార్యులు, భక్తులు, ప్రముఖులు పాల్గొన్నారు