Take a fresh look at your lifestyle.

ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక…..

 

ముద్ర నడిగూడెం…..

స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులు పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తను తొలగించారు. తరగతి గదులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ విజయ శ్రీ, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.