Take a fresh look at your lifestyle.

సమ్మె విజయవంతం…

ముద్ర : ఆత్మకూరు (ఎం)  దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆత్మకూరు మోత్కూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పైళ్ళ గణపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూపాయలు 26000 ఇవ్వాలని ఆయన కోరారు. పలు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె విజయవంతమైందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరల కిష్టయ్య , మండల గౌరవ అధ్యక్షులు స్వామి, అధ్యక్షుడు ఇంద్ర పెళ్లి జ్ఞానేశ్వర్ ,కార్యదర్శి రేగటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మందుల మహిపాల్, కోశాధికారి లక్ష్మయ్య , నరసింహ , ఉప్పలమ్మ ,రాచమల్ల లలిత, వేముల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.