ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు బాతుక అశోక్ హాజరు కాగా ఆలయ అర్చకులు వారికి లక్ష్మీనరసింహస్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు ఎదునూరి చంద్రయ్య, గడుగు నరేష్, కడరి భారత్, నీలం వెంకటేష్, గోగు పోచయ్య, గంగాధరీ మల్లేష్, గోదా మల్లేష్, మాకోలు శివ, శ్రీరాం శరత్ యాదవ్, నీలం సుదర్శన్, కడరీ భాను, కొత్తపల్లి శివ, జూపల్లి లింగస్వామి, నాగరాజు, అభినయ్ నాయకులు పాల్గొన్నారు.