Take a fresh look at your lifestyle.

వనపర్తి నుండి వీపనగండ్లకు నైట్ హల్ట్ బస్సు ప్రారంభం

ముద్ర,వీపనగండ్ల: వనపర్తి జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రమైన వీపనగండ్లకు నైట్ హల్ట్ బస్సును ప్రారంభించినట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాల్ రెడ్డి తెలిపారు.ప్రతిరోజు వనపర్తి బస్టాండ్ లో రాత్రి 7 గంటల 20 నిమిషాలకు ఆర్టీసీ బస్సు బయలుదేరి చందాపురం, చింతకుంట, మాందాపురం, రాయిణిపల్లి, బుసిరెడ్డిపల్లి, పుల్గర్ చెర్ల,కల్వరాల గ్రామాల మీదుగా వీపనగండ్లకు 8 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుందని తెలిపారు.అక్కడే నైట్ హాల్ట్ చేసి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాలకు పై గ్రామాల మీదుగానే వనపర్తికి చేరుకుంటుందని మండలంలోని ప్రజలు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.వనపర్తి జిల్లా కేంద్రం నుంచి రాత్రివేళ బస్సు సౌకర్యం కల్పించడంతో కార్యాలయ పనుల నిమిత్తం, ఆస్పత్రులకు వెళ్ళొచ్చే వారికి, దూరప్రాంతాలకు వెళ్లి వచ్చే వారికి సౌకర్యంగా ఉంటుందని మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వీపనగండ్లకు వనపర్తి నుంచి నైట్ హల్ట్ బస్సు సౌకర్యం కల్పించినందుకు వనపర్తి ఆర్టీసీ అధికారులకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.