గచ్చిబౌలి, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ డిప్యూటీ కమీషనర్ గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రశాంతి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ కమీషనర్ గా నియమితులైన శుభ సందర్భంగా శ్రీమతి ప్రశాంతి గారిని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం డిప్యూటీ కమీషనర్ శ్రీమతి ప్రశాంతి తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై డిప్యూటీ కమిషనర్ గారి తో చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడలని అని కోరారు.అదేవిధంగా చెరువుల సుందరికరణ, పార్క్ లు అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కోరారు.
