Take a fresh look at your lifestyle.

తుంగతుర్తి లో బి ఆర్ ఎస్ శ్రేణుల నిరసన.. రాస్తారోకో.

ఎస్ ఆర్ ఎస్ పి నీళ్లు ఏప్రిల్ నెలాఖరు వరకు ఇవ్వాలి..

యాసంగి రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలి

రైతు బీమా అమలు చేయాలి

 

ముద్ర ,తుంగతుర్తి…
తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగం పంటలు కాపాడేవిధంగా ఏప్రిల్ నెల చివరిదాకా ఎస్సారెస్పీ కాలువల ద్వారా గోదావరి జల్లాలు విడుదల చేయాలని తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో టిఆర్ఎస్ శ్రేణులు సోమవారం నిరసన తెలియచేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ యాసంగి రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలని. రైతుభిమా అమలు చేయాలని డిమాండ్ చేసారు.. మండలంలో కాలువ నీళ్ళను బందు చేయడం వలన దాదాపు ఇరవై శాతం పంటలు నిండు పొట్ట దశలో ఎండిపోయి ప్రమాదం ఉందని. రైతాంగం తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు తెలియ పరచినప్పటికీ కలెక్టర్ సైతం ఇప్పటివరకు స్పందించ లేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ సాగునీరు రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు .వెంటనే జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మాట్లాడి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేసారు.. రైతాంగం సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన శాస్తి చేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ మండల నాయకులు గుండగాని దుర్గయ్య గాజుల యాదగిరి సర్పంచ్ లు మనోజ్ ఎల్లయ్య. కర్ణాకర్. మాజీ ఎంపీటీసీ నరేష్ నాయక్. మాజీ సర్పంచ్ విరోజీ నాయక్. తడకమళ్ళ రవి కుమార్.నాగమల్లు మహేందర్. భాస్కర్. సైదులు క్రాంతి. జాని.. ధర్మానాయక. తునికిలక్ష్మి. బిక్షం.. సూరయ్య. వీరన్న. సాయికిరణ్.. తదితరులు పాల్గొన్నారు..

నాటి kcr పాలనకు నేటి కాంగ్రెస్ పాలనలో పంటలతీరును ఎండగడుతూ ఫ్లెక్సీ ధరించి ప్రదర్శన చేసిన సీతయ్య..

Leave A Reply

Your email address will not be published.