Take a fresh look at your lifestyle.

తెలంగాణ జనసమితి ప్లీనరీ విజయవంతం చేయండి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఈ నెల 12న హైదరాబాద్ లో నిర్వహించబోయే తెలంగాణ జన సమితి ప్లీనరీని జయప్రదం చేయాలని సమితి జిల్లా అధ్యక్షులు కడపత్రి తిలక్ రావు, పార్టీ రాష్ట్ర కోరారు. నిర్మల్ లోని తెలంగాణ జన సమితి పార్టీక్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కడపత్రి తిలక్ రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు ఉమ్మడి జిల్లా ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 12 వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జల విహార్ లో నిర్వహించే తెలంగాణ జన సమితి 4 వ ప్లినరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సాధించిన తెలంగాణ లో అమరుల ఆకాంక్షలు, అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలన్న ఉదేశ్యంతో
తెలంగాణ జన సమితి పార్టీని 2018 లో పార్టీ ఏర్పాటు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఇంచార్జి సర్దార్ వినోద్ కుమార్, విద్యార్ధి విభాగం రాష్ట్ర కార్యదర్శి దిలీప్, జిల్లా కార్యదర్శి చిట్ల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.