దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
సమాజ సేవలో ముందుండే స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ మేరకు జగిత్యాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆపి, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జిల్లా కేంద్రంలోని పావని కంటి హాస్పిటల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జగిత్యాల పూర్వ అధ్యక్షుడు, శాసన సభ్యుడు డా. సంజయ్ కుమార్, జగిత్యాల డిఎస్పి పురుషోత్తం రెడ్డి పాల్గొని, దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా రోటరీ క్లబ్ ఆపి, రెడ్ క్రాస్ సోసైటీ లాంటి స్వచ్ఛంద సంస్థలు సమాజ సేవలో ముందుకు వస్తూ వారి వంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న సందర్భంలో ఆయా సంస్థలకు అభినందనలు చెబుతున్నామన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా జగిత్యాల ప్రాంతంలో సేవయే పరమావధిగా తామందరము కలిసి చేస్తున్న కృషి ఫలితంగానే ఈరోజు ప్రజలందరి ఆదరణతో శాసనసభ్యుడి స్థాయికి తాను ఎదగగలిగానని అన్నారు. ప్రధానంగా ఉచిత కంటి ఆపరేషన్లు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అర్హులైన వారికి దివ్యంగా ఉపకరణాలు విద్యార్థులకు కంటి పరీక్షలు, రోటరీ గంగా పేరుతో మంచినీటి ట్యాంకులు ఏర్పాటు, ఉచిత వైద్య శిబిరాలు లాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలను ఎలాంటి లాభపరీక్ష లేకుండా ఒక టీం వర్క్ గా నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వాలు పేద ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా, స్వచ్ఛంద సంస్థలు చేసే కార్యక్రమాలకు అండగా నిలిచే పారిశ్రామిక వర్గాల వారు, వివిధ వ్యాపార సంస్థల వారు సిఎస్ఆర్ నిధులతో చేపట్టే నిధులు అర్హులైన వారికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం డీఎస్పీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ రోటరీ ఆపి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇలాంటి సంస్థలు నిర్వహించే కార్యక్రమాలు పేద ప్రజలకు సమాజంలో ఎంతగానో ఉపయోగపడటం అభినందనీయమని, వారు చేస్తున్న కృషి హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ కరుణాకర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ కార్యదర్శి మంచాల కృష్ణ, కార్య నిర్వాహక కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్ ఈ కార్యక్రమం నిర్వహించగా, టౌన్ సీఐ కరుణాకర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ కార్యదర్శి
మంచాల కృష్ణ, కార్య నిర్వాహక కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు, సభ్యులు కొత్త ప్రతాప్, డా. వెంకటేశ్వర్, డా.విజయ్, డా.శేఖర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్కమిటీ ఛైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, కౌన్సిలర్ లు సుంకేటి మమత, దుమాల రాజ్ కుమార్, కోరే గంగమల్లు, నాయకులు బాల ముకుందం, ఖజిం అలీ, బాసమహేష్, వేణు, అబ్బూరి మల్లేశం గౌడ్, పులి నర్సయ్యా, వంశీ,మహేష్,రవి గౌడ్, రామకృష్ణారెడ్డి , కో ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.