Take a fresh look at your lifestyle.

తండ్రి మరణం… కన్నీటితో పది పరీక్ష రాసిన కొడుకు

 

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:

జోగుళాంబ గద్వాల జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. కేటిదొడ్డి మండలం విశ్వబ్రహ్మణ మండలాధ్యక్షులు,‌ గంగన్ పల్లి గ్రామానికి చెందిన సదానందం అచారి(44) మంగళవారం సాయంత్రం గద్వాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం ఆయన పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ దు:ఖాన్ని దిగమింగుకొని పాతపాలెం జడ్పీహెచ్ఎస్ లో పదో తరగతి చదువుతున్న సాయివిష్ణు తండ్రి మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న కుమారుడు తన లక్ష్యాన్ని వీడకుండా బుధవారం నిర్వహించి‌న పదో తరగతి వార్షిక హిందీ పరీక్షకు హాజరయ్యాడు. ఈ విషాదకర సంఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. తండ్రి మరణించిన పుట్టెడు దు:ఖంలో కూడా, తన భవిష్యత్తు కోసం కన్నీళ్లతో పరీక్షా కేంద్రానికి వచ్చిన ఆ విద్యార్థి.. తన సహచర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎంఈఓ విజయభాస్కర్, ఉపాద్యాయులు, స్థానికులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.