Take a fresh look at your lifestyle.

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

 

ముద్ర కాప్రా: 

కాప్రా డివిజన్ పరిధిలోని తిరుమల శివపురి కాలనీలో రూ.1 కోటి 48 లక్షల .50 వేల వ్యయంతో బీటీ రోడ్ల, శాలివాహన కాలనీలో రూ.95 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ , సీఎస్ నగర్‌లో రూ.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజ్ వంటి సమస్యలను దశలవారీగా పరిష్కరించి ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బైరీ నవీన్ కాలనీ ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.