Take a fresh look at your lifestyle.

నాణ్యమైన ధాన్యాన్ని 24 గంటల్లో రైస్ మిల్లులకు తరలించాలి

  • జిల్లా కలెక్టర్ బి . సత్యప్రసాద్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: యాసంగి పంటలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లో రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులకు సూచించారు.సోమవారం జిల్లా కలెక్టర్ మేడిపల్లి మండలం కొండాపూర్, కాచారం గ్రామంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో జరగాలని అన్నారు.కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తేమ శాతం వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రికార్డు చేయాలని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లోగా రైస్ మిల్లులకు తరలించాలని సెంటర్ నిర్వాహకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జివాకర్ రెడ్డి, తహసిల్దార్ వసంత, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.