- మండల విద్యాధికారి జమునదేవి.
గొల్లపల్లి, ముద్ర విలేకరి : రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా సంవత్సరం లో ప్రతి ఏటా విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారాని ఎంఈఓ తెలిపారు.జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రంలో విద్యాధికారి జామున దేవి ఆధ్వర్యంలో ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ఆరంభానికి మరికొద్ది రోజులే గడువు ఉండడంతో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను పాఠశాలలు జూన్ 12 నుంచి ప్రారంభం కావడంతో మండలంలో అన్ని ప్రభుత్వ, పాఠశాలలకు ప్రభుత్వం నుంచి ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించాలని ఉపాధ్యాయులకు ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జమున దేవి, ఎఫ్ ఎల్ ఎన్ నోడల్ ఆఫీసర్ చెరుకు రాజన్న సిఆర్పి లు ప్రభాకర్, రాజేందర్, లచ్చయ్య, రాజయ్య ప్రధానోపాధ్యాయులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
