Take a fresh look at your lifestyle.

మతం మారితే ఎస్సీ హోదా  రద్దు మత మార్పిడిలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

 

న్యూఢిల్లీ :

ఎస్సీ కులానికి చెందిన వారు మతం మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోకి కాకుండా ఇతర ఏ మతంలోకి మారిన వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. గతంలో ఏపీ హైకోర్టు జరిగిన విచారణలో.. క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్‌ ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని సుప్రీం న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ వారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సుప్రీంకోర్టు మద్దతుగా నిలిచింది.

అసలు కేసు ఇది

గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో ఒక పాస్టర్‌పై జరిగిన దాడికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దశాబ్ద కాలంగా పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లు కోర్టు గుర్తించింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని, కాబట్టి ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. దాడి జరిగిన సమయంలోనూ సదరు వ్యక్తి ప్రార్థనలు చేస్తున్నట్లు గుర్తించిన కోర్టు, ఈ వ్యాఖ్యలు చేసింది. తహశీల్దార్ ఇచ్చిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, మత మార్పిడి తర్వాత ఆ చట్టపరమైన రక్షణ పొందేందుకు సదరు వ్యక్తికి అర్హత ఉండదని కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం, ఎస్సీ హోదా కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అనుసరించే వారికి మాత్రమే పరిమితం చేయబడింది. మత మార్పిడి ద్వారా క్రైస్తవం, ఇస్లాం మతాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే ఎస్సీ హోదా రద్దవుతుందని, తద్వారా అట్రాసిటీ చట్టం వర్తించదని హైకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది. ఈ తీర్పును సవాల్ చేసి సుప్రీంకి వెళ్లిన ఫాస్టర్ కు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది.

Leave A Reply

Your email address will not be published.