Take a fresh look at your lifestyle.

భార్యను చంపి నగలతో పరారైన భర్త

ముద్ర ప్రతినిధి, మెదక్:
కట్టుకున్న భార్యను చంపిన భర్త ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకొని పారిపోయిన సంఘటన మెదకే జిల్లా చేగుంట రైల్వే స్టేషన్ రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుస కథనం ప్రకారం..మండల కేంద్రంలోని వెంకటేశ్వర టెంపుల్ ట్యాంక్ సమీపంలో నివసించే వరలక్ష్మి, ఆమె భర్త త్రిమూర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఉదయం వివాదం కాస్త తీవ్ర రూపం దాల్చడంతో ఆవేశానికి లోనైన త్రిమూర్తి కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతురాలి బావ సాయిబాబా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.