విద్యుత్ ఆర్టిజన్ కార్మిక సమస్యలు పరిష్కరించాలి -స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కోరిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
విద్యుత్ ఆర్టిజన్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. సోమవారం విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పి మహేష్ , కన్వీనర్ బుచ్చి రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 19400 మంది విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు యజమాన్యం, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మా సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు మాదిరిగానే మాకు కూడా ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ వచ్చేంతవరకు మా సమ్మె కొనసాగిస్తామని వారు తెలిపారు. ఆరో రోజులు గడుస్తున్న ఇంకా యజమాన్యం, ప్రభుత్వం స్పందించకాపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. చర్చలకు పిలవకుండా యజమాన్యం, ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలి అన్నారు. యజమాన్యం ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె ఇంకా సమ్మె ఇంకా ఉద్ధృతం చేస్తామని వారు. ఇప్పటికైనా యజమాన్యం ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో విద్యుత్ అంతరాయం తప్పకుండా ఉంటుందన్నారు.
2026 పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బాల్ రాజు, అక్తర్ అలి, శేఖర్, మెమిన్ , వెంకటయ్య, సతిష్, ఆంజనేయులు, శ్రీశైలం, అమీద్, పరామేష్, సంతోష్. ప్రసాద్, రాజ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, సురేష్, విజయ్ వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.