ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లాలో జరగనున్న జనగణన కార్యక్రమానికి సంబంధించి సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామక ప్రక్రియను పూర్తిచేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. హైదరాబాద్ నుండి కులగణన సంచాలకులు భారతి హోళికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26 నుండి మే 10వ తేదీ వరకు నిర్వహించబడనున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1406 మంది ఎన్యూమరేటర్లు, 248 మంది సూపర్ వైజర్లను నియమించామని వివరించారు.
జనగనన సూపరిండెంట్ గఫార్, ఈడియం సందీప్ తదితరులు పాల్గొన్నారు.