- బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలి
- రాష్ట్ర ఫిషరీస్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన గద్దర్ ను అవమానిస్తూ మాట్లాడిన కేంద్రమంత్రి బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఫిషరీస్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గాంధీభవన్‌లో మీడియాతో సాయి కుమార్ మాట్లాడారు.. తెలంగాణ ద్రోహి అయిన బండి సంజయ్‌కు ఉద్యమకారుల ప్రాణ త్యాగం విలువ ఏం తెలుసని ఆయన మండిపడ్డారు.
పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేక బీజేపీ దేశ అధ్యక్షుడు ఇస్తున్నారా? అని నిలదీశారు. గద్దర్ ను నక్సలైట్ అని సంభోదించే హక్కు బండి సంజయ్ కు ఎక్కడిది అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలస వెళ్ళిన మహేశ్వర్ రెడ్డి, డీకే అరుణలకు కూర్చి ఉంది కానీ బండి సంజయ్‌కు లేదని ఆయన ఎద్దేవా చేశారు. బాధ, ఉక్రోషం, ఆవేశం పాటు సర్వరోగాలు ఉన్న బండి సంజయ్ మతి తప్పి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.