గెజిటెడ్ అధికారులకు ఇళ్ల స్థలాలకై భూమి కేటాయింపుకు సహకరించండి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసిన రంగారెడ్డి జిల్లా టీజీవో ప్రతినిధులు
(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న గెజిటెడ్ అధికారులకు పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సొసైటీ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం అవసరమైన భూమిని కేటాయించేలా చూడాలని సదరు సంఘం జిల్లా ప్రతినిధులు శుక్రవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా టీజీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామారావు, కార్యదర్శి నరేష్ కుమార్ నోరి, ఇతర కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని ఆయన నివాసంలో కలిసి టీజీవో-2026 డైరీని, క్యాలెండర్ ను అందజేశారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ ఆఫీసర్లకు ఇంటి స్థలాల కోసం పరస్పర సహాయ సహకార గృహనిర్మాణ సొసైటీకి భూమిని కేటాయించాలని ఎమ్మెల్యేను అభ్యర్థించారు. ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ చెల్లింపు, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వంతో చర్చించి తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా టీజీవో ప్రతినిధి బృందం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని కోరారు. ఎమ్మెల్యే ను కలిసిన బృందంలో శాంతిశ్రీ, సైదమ్మ, జ్యోత్స్న, రాణి, పావని, మసూద్ అలీ, ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ అజయ్ వీర్ రెడ్డి తదితరులు ఉన్నారు.