Take a fresh look at your lifestyle.

స్విమ్మింగ్ పూల్ ను పారారం మించిన టీజేఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి:

స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ పార్క్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను శనివారం టీజేఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్‌లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీజేఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ పార్క్ పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడాభివృద్ధిలో భాగంగా సుమారు రూ. 20 లక్షల వ్యయంతో ఈ పూల్‌ను పునరుద్ధరించినట్లు తెలిపారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడానికి ఇటువంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ చై కూన వనిత సంతోష్ మాట్లాడుతూ సుమారు పది సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పూల్‌ను మరమ్మతులు చేయించి తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. పట్టణ ప్రజలకు మెరుగైన క్రీడా వసతులు కల్పించడం తమ లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని క్రీడా సదుపాయాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు.
యువజన సంక్షేమశాఖ మరియు స్పోర్ట్స్ అథారిటీ అధికారి అఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంలో స్విమ్మింగ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుందని పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్‌ను పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచుతూ నెలవారీ, మూడు నెలల, ఆరు నెలల కార్డుల రూపంలో రేట్లు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి వయస్సు వారికి అనుకూలంగా సమయాలను కూడా కేటాయించినట్లు వెల్లడించారు.
వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా పిల్లలు, యువత పాల్గొనాలని అఖిలేష్ రెడ్డి కోరారు. స్విమ్మింగ్ ద్వారా ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు క్రీడా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, క్రీడా విభాగం సిబ్బంది, కౌన్సలర్స్ , ప్రజాప్రతినిధులు , క్రీడాభిమానులు ,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.