ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ లో 100 శాతం చేయాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పేర్కొన్నారు. జన ఔషది దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్య అధికారులు, ఆశా వర్కర్లు,ఏఎన్ఎం తో జిల్లా కలెక్టర్ సమీక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయా మండల వారిగా సబ్ సెంటర్ పిహెచ్ సెంటర్ల ప్రస్తవల సంఖ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీ స్త్రీలకు ఫస్ట్ ,సెకండ్ ఎ న్ సి సబ్ సెంటర్ లోనే అందించాలని డెలివరీ కి సిద్ధంగా ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.ప్రభుత్వ ఆస్పత్రులు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయనే క్షేత్రస్థాయిలో ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని వైద్య అధికారులకు తెలిపారు.నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ ఉన్న వారిని మార్చి నెల ఆఖరి వరకు పూర్తిగా గుర్తించి వైద్యం అందించాలని,షుగర్ పేషెంట్లను మానేటరింగ్ చేసి వారికి కావాల్సిన వైద్యం,మందులు అందించాలని అన్నారు.టి బి పరీక్షలకు సంబంధించి ప్రణాళికను ప్రకారం చేసుకోవాలని అన్నారు.రానున్న వేసవికాలం నేపథ్యంలో అన్ని సబ్ సెంటర్ పిహెచ్ సెంటర్ల లో ఓఆర్ఎస్ ప్యాకెట్ ,ద్రావణాలు అందుబాటులో ఉంచుకోవాలని ఉపాధి హామీ పనులను ఇతర రతర పనులకు వెళ్లి వారికి ఉదయం పూట వెళ్లాలని అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు.ఈ సమావేశంలో,డిఎంహెచ్ ప్రమోద్,డిప్యూటీ డిఎంహెచ్వో శ్రీనివాస్ ,ఆర్ ఎం ఓ ,డాక్టర్లు ,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
