- తెలంగాణపై మా ప్రేమ వర్ణించలేనిది.
- ఎంతో మంది ప్రాణత్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం.
- తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చేయడంలోనే మా స్టైల్ కనిపించింది.
- 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అక్షయపాత్ర కాళేశ్వరం.
- డల్లాస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
- తెలంగాణ తల్లి గర్విస్తోంది.
- అదే తెలంగాణ స్టైల్.
- అక్షయపాత్రగా నిలిపాం.
- మార్పులకు అనుగుణంగా.
కేసీఆర్ తీసుకున్న ప్రతి సంక్షేమం, విధానం కింద మానవీయ కోణం ఉందన్నారు. కేసీఆర్ కిట్‌తో శిశు, మాతృ మరణాలు తగ్గాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుంచి నేను వెళ్తా గవర్నమెంట్ హాస్పిటల్‌కు అన్న స్థితికి తీసుకువచ్చామన్నారు.ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేశామని వివరించారు.ప్రతి జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ సర్కార్. విదేశీ స్కాలర్‌షిప్‌లతో విదేశీ విద్యకు అవకాశం కల్పించామన్నారు. ఇక్కడి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసిందని అవసరమైతే లీగల్ సెల్ ఏర్పాటు చేసి వారికి అండగా నిలబడతామన్నారు.విజ్ఞాన ఆధారిత దేశాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు.విదేశాల్లో జాబ్స్ పోతాయనే ఆందోళన నెలకొన్నదని మార్పులకు అనుగుణంగా మనం కూడా మార్పును సాధించాలన్నారు.ఎదురయ్యే సాకేంతిక సమస్యను ఎదుర్కొని పరిష్కరించుకోవాలన్నారు.