Take a fresh look at your lifestyle.

పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకి ఇచ్చే అతి పెద్ద బహుమతి – జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి, ఖమ్మం
పిల్లలు ప్రమాణాలతో కూడిన విద్యను అందుకొని ఉన్న స్థాయికి చేరుకోవడమే వారి తల్లిదండ్రులకు ఇచ్చే అతి పెద్ద బహుమతి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.


ఎర్రుపాలెం మండలం సందర్శన సందర్భంగా బుధవారం ఎర్రుపాలెం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులం బాలికల కళాశాలలో నిర్వహించిన ” తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం” వేడుకకు హాజరైన కలెక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కుల వివక్ష లేని సమాజంగా తెలంగాణను నిర్మించే దిశగా ప్రభుత్వం సాంఘిక, ఆర్థిక సర్వేను విజయవంతంగా నిర్వహించి 4 ఫిబ్రవరి, 2025న అసెంబ్లీలో ప్రవేశపెట్టారని తెలిపారు. కుల,మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమరపరుస్తుందని పేర్కొన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలను 40 శాతం పెంచడం జరిగిందని, ఈ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు సమీకృత గురుకుల విద్యాలయ నిర్మాణాలు చేపట్టిందన్నారు. సామాజిక న్యాయం ఉన్న సమాజాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వినియోగించుకుంటూ బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మంచి విద్యాసంస్థల ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్థులకు అవసరమైన డైట్,కాస్మోటిక్ చార్జీలు ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ గురుకులాల పట్ల ప్రజలకు నుంచి మంచి స్పందన ఉందన్నారు.మంచ�

Leave A Reply

Your email address will not be published.