- అక్రమార్కులకు పట్టాలు చేయకుండా అడ్డుకట్ట వేయాలి.
- రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందజేత.
మంథని, ముద్ర విలేకరి : మంథని రెవెన్యూ డివిజనల్ అధికారికి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూభారతిలో భూ కబ్జాదారులు అక్రమార్కులు ప్రభుత్వ భూములకు పట్టాల కొరకు దరఖాస్తులు పెట్టుకున్నట్లు మా దృష్టికి వచ్చిందని మంథని మున్సిపల్ పరిధిలోని రెవెన్యూ ఆబాది మున్సిపాలిటీ కి సంబంధించిన భూములు ఆక్రమణకు గురయ్యాయి అని మంథని నియోజకవర్గంలోని ఇతర మండలాలు గ్రామాలలో ప్రభుత్వ భూములు సీలింగ్ భూములు బంజరు భూములు దేవాదాయ భూములు గైరాన్ భూములు అసైన్డ్ భూములు ఇనాం భూములు చెరువు ఎస్సీ కార్పొరేషన్ భూములు చెరువు శిఖం భూములను కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని అన్నారు. అక్రమార్కులు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి పట్టాల కోసం భూభారతిలో దరఖాస్తులు పెట్టుకున్నారని అన్నారు.అట్టి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రత్యేక దృష్టి సారించి పట్టాలు చేయకుండా అడ్డుకట్ట వేసి భావితరాల కోసం ప్రభుత్వ భూములను రక్షించాలని కోరారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాబు రవి ఉన్నారు.