యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: స్తానిక ఎన్.సి.ఒ.ఎ క్లబ్ లో సోమవారం ఆషాఢ మాసపు గోరింటాకు సంబరాలు జరిగాయి. ఉదయం క్లబ్ మహిళా సభ్యులు ఏర్పాటు చేసిన సంబరాల్లో రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలమేరకు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ సతీమణి వనజావెంకటయ్య సాధారణంగా ఆహ్వానించగా, ఆమె క్లబ్ మహిళా సభ్యులతో కలిసి ఆషాఢపు గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ..ఆషాఢ మాసం మహిళల ఆధ్యాత్మికత, అనుసంధానానికి ప్రతీక. ఈ సందర్బంగా నిర్వహించే గోరింటాకు వేడుకలు మహిళల సామూహికతను, సాంస్కృతిక విలువలను పదిలంగా కాపాడుతాయన్నారు..ఇక మహిళా క్లబ్ సభ్యులందరితో సౌహార్దపూర్వకంగా మమేకమై, గోరింటాకు వేయించుకొని వారితో సంబురాలను పంచుకున్నారు.