Take a fresh look at your lifestyle.

వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలి కేయూ మాజీ ఈసీ సభ్యులు సత్యనారాయణ గౌడ్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం కేంద్రం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఈసీ సభ్యులు సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు.వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ -2026 జిల్లాస్థాయి ఎంపిక పోటీలు స్థానిక వశిష్ఠ డిగ్రీ కళాశాలలో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పౌరులుగా వికసిత భారత్ కోసం చేయాల్సిన కృషిని వివరించారు. అనంతరం నిర్వహించిన ఉపన్యాస పోటీలో జిల్లాకు చెందిన పలు డిగ్రీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ అర్చన, జ్యూరీ సభ్యులు డా.గంగాధర్ అసోసియేట్ ప్రొఫెసర్లు మురళి, రవి కుమార్ తో పాటు శశిరాజ్ , అఖిలేష్ కుమార్ సింగ్, ప్రోగ్రాం ఆఫీసర్ సిహెచ్ రవి పలు కళాశాలల ఉపన్యాసకులు పాల్గొన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.వారు రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు. విజేతలుగా బాసర ట్రిపుల్ ఐటీ కి చెందిన సాయి చంద్, చరిత, వశిష్ఠ డిగ్రీ కళాశాల కు చెందిన సోహా మరియం, భైంసా డిగ్రీ కళాశాల కు చెందిన లక్ష్మణ్, నిర్మల్ డిగ్రీ కళాశాలకు చెందిన శేఖర్ నిలిచారు.

Leave A Reply

Your email address will not be published.