Take a fresh look at your lifestyle.

కోదాడ లో ఆధిపత్యం మహిళలదే

 

ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ , మున్సిపల్ చైర్ పర్సన్ , వైస్ చైర్ పర్సన్ , కమిషనర్ మహిళలే

ముద్ర ప్రతినిధి , కోదాడ …. కోదాడ నియోజకవర్గంలో మహిళల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది . నలమాద పద్మావతి రెడ్డి కోదాడ నియోజకవర్గానికి రెండవసారి ఎమ్మెల్యే గా ఎన్నికై నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ పదవులలో మహిళలకు కూడా సమప్రాధాన్యం ఇస్తున్నారు . ఇక మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఏపూరి తిరుపతమ్మ కి అవకాశం రాగా ఇక కోదాడ మున్సిపాలిటీలో కూడా మహిళలే కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎర్నేని కుసుమ కుమారి, వైస్ చైర్ పర్సన్‌గా దేవరపల్లి మల్లీశ్వరి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్‌గా రమాదేవి విధులు నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తోంది. రాజకీయ నాయకత్వం నుంచి పరిపాలనా వ్యవస్థ వరకు మహిళలు ముందుండి బాధ్యతలు చేపట్టడం కోదాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. మహిళలు అన్ని రంగాల్లో సమర్థంగా రాణించగలరనే విషయాన్ని ఇది మరోసారి నిరూపిస్తున్నదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కోదాడ నియోజకవర్గంలో మహిళలు కీలక పదవుల్లో కొనసాగడం మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.