Take a fresh look at your lifestyle.

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి -సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

జిల్లాలో గర్భస్థ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలని, రోగులకు ఓపికగా మెరుగైన వైద్యం అందిస్తూ వారికి భరోసా ఇవ్వాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. చేర్యాల పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం లోపల అన్ని గదులు తనికి చేశారు. ఇప్పటివరకు ఎంత ఓపి చూశారని మెడికల్ ఆఫీసర్ ఆరా తీశారు. వైద్య పరికరాలు మందులు సమకూర్చుకుని రోగులకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ నుండి కింది స్థాయి సిబ్బంది వరకు సమయవేళలు పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఓపి వార్డు గర్భస్థ మహిళల వార్డులలో మహిళలతో మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యం ఎలా ఉంది డాక్టర్లు ఎలా చూస్తున్నారు అని అడగ్గా బాగానే ఉందని డాక్టర్లు నర్సులు బాగా రెస్పాండ్ అవుతున్నారని రోగులు కలెక్టర్ కి తెలిపారు. పట్టణ పరిధిలోని గ్రామాల్లోని గర్భస్థ మహిళల ఆరోగ్య స్థితి గతులను పర్యవేక్షణ చెయ్యాలని ప్రతి గర్భిణీ ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేసుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రికి ఒక్క మహిళ కూడా వెళ్లకుండా పని చెయ్యాలని మెడికల్ ఆఫీసర్ ఏ ఎన్ ఎం లను ఆదేశించారు. అన్ని జిల్లా జనరల్ ఆసుపత్రులలో అన్ని సదుపాయాలు కల్పించాలని ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డాక్టర్, సిబ్బంది పైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా డిఎంఅండ్ఎచ్ఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.