టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు తథ్యం.
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.
ముద్ర. పరకాల. :
కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లోనే మోసం ఉందని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా బుద, గురువారాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. 6 , 7,8 ,9 వార్డులలో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం కార్నర్ మీటింగ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు తద్యమన్నారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే కు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి పరకాల ఓటర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పరకాల పట్టణంలోని అన్ని కాలనీలలో సిసి రోడ్లు మురుగునీటి కాలువలు విద్యుత్ స్తంభాలు పారిశుద్ధ్య సమస్య ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లను పంపిణీ చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చెందుతుంది అన్నారు. ఆరు మోసపూరిత వాగ్దానాలతో తెలంగాణ ప్రజలు మోసపోయారని రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ నిజస్వరూపం తెలుసుకొని కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలో గెలిచిన ఏ ఒక్క అభ్యర్థి పరకాల నియోజకవర్గం తో పాటు పరకాల మండలాన్ని పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదని మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే పరకాల మున్సిపాలిటీగా మారిందన్నారు. పరకాల పట్టణంలోని అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేసి ప్రజల మన్ననలను పొందినది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ధర్మారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీపై టిఆర్ఎస్ జండా ఎగురుతుందని ఆయన ధీమానే వ్యక్తం చేశారు 22 వార్డులలో సుమారు 18 వార్డుల వరకు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందుతారని ధర్మారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఆరవ వార్డ్ అభ్యర్థి తుమ్మల రాణి రవి, 8వ వార్డు అభ్యర్థి అడప రాము , ఏడవవాడ అభ్యర్థి దుంపేటి నాగరాజు 9వ వార్డు అభ్యర్థి బండారి కవిత కృష్ణ తో పాటుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.