Take a fresh look at your lifestyle.

జల్సాలకు అలవాటుపడి వరుస దొంగతనాలు నిందితుడి అరెస్ట్, రూ. 1.80 నగదు, బంగారం రికవరీ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్

ముద్ర ప్రతినిధి, మెదక్:
జల్సాలకు అలవాటుపడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు
అతని వద్ద నుంచి బంగారు, వెండి నగలు, నగదు స్వాధీనం చేసుకొన్నట్లు మెదక్​ టౌన్​ ఇన్స్పెక్టర్ మహేష్​ తెలిపారు. ఈ మేరకు మెదక్​ టౌన్​ పోలీస్​స్టేషన్​లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. హవేళీ ఘనపూర్​ మండలం తొగిట గ్రామానికి చెందిన మాచబోయిన మహేష్​ కుమార్​ అనే యువకుడు జల్సాలకు, అమ్మాయిలతో సరదాలకు అలవాటుపడి అందుకు డబ్బుల కోసం తాళం వేసి ఉన్న ఇళ్ళు, ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతు తరచు జైలుకు వెళతాడు. ఈ క్రమంలో డబ్బు అవసరమైన సమయంలో ముందస్తుగానే ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి రాత్రి పూట చోరీలకు పాల్పడుతుండగా శనివారం మెదక్​ పట్టణంలోని జేఎన్​ రోడ్డులో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దొంగతనాలకు పాల్పడుతున్న మహేష్​ కుమార్​ వద్ద నుంచి రూ.1.80 లక్షల విలువైన బంగారు నగలతో పాటు ఆలయాల వద్ద చోరీ చేసిన రూ.25,348 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మహేష్​ కుమార్​పై ఒక మర్డర్​ కేసు ఉండగా మరో తొమ్మిది ఇతర కేసులున్నాయి. దొంగనాలకు పాల్పడుతున్న నిందితున్ని పట్టుకోవడంలో మెదక్​ టౌన్​ పోలీసులతో పాటు సీసీఎస్​ పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారని అభినందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితున్ని అరెస్టు చేసినట్లు మహేష్​ తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన మహేష్​ కుమార్​ ఈనెల 11వ తేదీన జైలు నుంచి విడుదలై తిరిగి 12వ తేదీన మిలటరీ కాలనీలో గల హనుమాన్ దేవాలయంలో దొంగతనం చేసినట్లు ఇన్స్పెక్టర్ మహేశ్ వివరించారు.

Leave A Reply

Your email address will not be published.