ముద్ర ప్రతినిధి,గోదావరిఖని:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం గోదావరిఖని కోదండరామాలయం శివాలయంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్-మనాలి ఠాకూర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనగామ గ్రామంలో ప్రసిద్ధి చెందిన చారిత్రక త్రిలింగేశ్వరాలయంలో ఎమ్మెల్యే దంపతులు పూజలు చేశారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు.అదేవిధంగా పాలకుర్తి గ్రామంలోని శివాలయాన్ని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకునిపూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మహాశివరాత్రి అనేది భారతదేశ ఆధ్యాత్మికలో ఎంతో ముఖ్యమైందని అన్నారు.మహాశివరాత్రి హిందువులు ఆచరించే పండుగ శివపార్వతుల వివాహం మహాశివరాత్రి ఎంత ప్రాముఖ్యమైనది అన్నారు.
