Take a fresh look at your lifestyle.

కూచాద్రి సన్నిధిలో ఎమ్మెల్యే రోహిత్ పూజలు

ముద్ర ప్రతినిధి, మెదక్:
హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని కూచన్ పల్లి కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారి గోపాల్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. అనంతరం రేణుకమాత దేవాలయంలో పూజలు నిర్వహించారు. వెంట యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరశురామ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, రాగి అశోక్, భూపతిరాజు తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.