ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలోని చెరువు కట్ట వద్ద ఉన్న నూతన ఈద్ గాపై
స్టే ఆర్డర్ ఉండడంతో నమాజ్ చదువకుండ మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసి ఉల్లాహ్ ఖాన్, భువనగిరి పట్టణ ముస్లిం సోదరులు వెనుతిరిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన ఈద్గాలో లాండ్ గ్రాబర్స్ అనధికారికంగా కబ్జా చేసి హైకోర్టు ను తప్పు దోవ పట్టించి, అక్రమంగా స్టే ఆర్డర్ తీసుకొచ్చారని ఖండించారు.
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో మాజీ హోం మంత్రి మహేమూద్ అలీ, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి పట్టణ మైనారిటీ నాయకులతో వక్ఫ్ బోర్డు కి చెందిన సర్వే నెంబర్ 902లో 3ఎకరాలు 23గుంటల భూమిని కబ్జా దారుల చెర నుండి విడిపించి ఈద్ గా కోసం అధికారికంగా కేటాయించడం జరిగిందన్నారు.
నాటి నుండి నేటి వరకు జరుగుతున్న నమాజ్ ను.చదవకుండ ల్యాండ్ గ్రాబర్స్ హై కోర్టు ను తప్పు దోవ పట్టించి స్టే ఆర్డర్ ను తీసుకొని నమాజ్ చదవకుండా నిలిపి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఖాజా అజీమోద్దీన్, ఎండీ ముజీబ్ ఇక్బాల్ చౌదరీ, నయీమ్, కాజమ్, ఇస్మాయిల్, ఆమెర్, ఖాజా ఖుతుబొద్దిన్, రహీం అంజాద్ పాల్గొన్నారు.