- జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల అభివృద్ధికి రూ. 70 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణ 40వ వార్డులో టియు ఎఫ్ ఐ డి సి నిధులు రూ. 20 లక్షలతో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 40వ వార్డులో 2 కోట్ల తో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయటం జరిగిందని, 60 లక్షల పనులు జరుగుతున్నాయని, రాష్ట్రం లో ఎక్కడాలేని విధంగా డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. పట్టణ పారిశుద్యం లో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉందని, లే అవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం 34 కోట్లు మంజూరు కాగా పనులు పూర్తి అయ్యాయని, డబల్ బెడ్ రూం కాలనీలో విద్య వైద్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవి అత్యున్నతమయినదని, ఎంపీ అరవింద్ ని కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం తో కలిసి పనిచేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ శివ కేసరి బాబు, ఓరుగంటి నగేష్, కొత్త ప్రతాప్, డిఇ నాగేశ్వర్, ఎఇ శరన్ తదితరులు పాల్గొన్నారు.
