Take a fresh look at your lifestyle.

పసుపు రైతుల మహా ధర్నా

  • మద్దతు ధర కోసం రోడ్డెక్కిన పసుపు రైతులు

మెట్ పల్లి, ముద్ర: కోరుట్ల నియోజకవర్గం అఖిలపక్ష రైతు సంఘం నాయకులు ధర్నాకు దిగారు.జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి శాస్త్రి చౌరస్తా వద్దకు ర్యాలీగా వచ్చి ధర్నాకు దిగి 2నిముషాలు మౌనం పాటించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ… ఉమ్మడి కరీంనగర్,నిజామాబాద్ జిల్లాలో ప్రధాన పంటైన పసుపు ధరకు మందతు ధర ప్రకటించాలనికోరుతున్నామని పసుపు బోర్డు వచ్చిందని సంతోష పడాలో రైతుకు మద్దతు ధర లేదని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఏర్పడిందని ఎన్నడూ లేని విదంగా పసుపు కేవలం 5000 ధర ఉండడం పెట్టుపడి ఖర్చులకు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల బతుకు మారాలంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పసుపు మద్దతు ధర ప్రకటించాలని అన్నారు.మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకోని పదవులు పొద్దటమే తప్ప రైతులకు ఒరిగింది ఏమిలేదని ప్రభుత్వం ఏర్పడేదాకా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే నాయకులు ప్రభుత్వం వచ్చాక రైతులను రోడ్డు ఎక్కిస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు పసుపుకు కనీస మద్దతు ధర 15 వేల రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు.అలాగే మార్కెట్ ఇంటర్వేషన్ స్కీమ్ నందు పసుపును కలుపాలని అన్నారు.విషయం తెలుకున్న సబ్ కలెక్టర్ శ్రీనివాస్ ధర్నా వద్దకు చేరుకొని మీ సమస్యను కలెక్టర్ దృష్టితో పాటు ప్రభుత్వానికి చేరవేస్తామని తెలపడంతో ధర్నా విరమించారు.ఈ మహాధర్నా కార్యక్రమంలో డివిజన్ లోని రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.