Take a fresh look at your lifestyle.

జగిత్యాలలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలి

  • రైతులకు అండగా నిలిచేందుకు పసుపు, మొక్క జొన్న, కందులకు మద్దతు ధర కల్పించాలి.
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఇసుక క్వారీలు లేకపోవడంతో ఇసుక అందుబాటులో లేక ఇబ్బందిగా మారిందని జగిత్యాలలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో రామాలయం వద్ద ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి, నిర్వహణ లోపంతో మూసివేశారని, నిర్మాణ రంగానికి ఇసుక అందుబాటులో లేకపోవడం తో నిర్మాణ రంగం కుంటు పడుతోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని, ఇసుకను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ధర్మ శాల స్థలంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయలన్నారు.జిల్లాలో అక్రమ ఇసుక రవాణా, ఇసుక డంపులను అరికట్టడంలో జిల్లా కలెక్టర్ చొరవ అభినందనీయని, జగిత్యాల లో నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుక స్టాక్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు లేఖ రాసీ,మాట్లాడానని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.రైతులకు అండగా నిలిచేందుకు పసుపు, మొక్క జొన్న, కందులకు మద్దతు ధర కల్పించాలన్నారు.కందులకుసైతం మద్దతు ధర కల్పించేందుకు కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం కు లేఖ రాశాననీ గుర్తు చేశారు.పసుపు బోర్డు ఏర్పాటు తో పసుపు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారని, పసుపు రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించకపోవడం పై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ,ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ సామాజిక కోణంలో ఎంపిక చేసినట్టు భావిస్తున్నాను అని అన్నారు.పదవితో సంబంధం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో ఒకడిగా సేవలు అందిస్తాను అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.ఈ సమావేశంలో నాయకులు, ఆర్టిఏ సభ్యుడు కమటాల శ్రీనివాస్, బండ శంకర్, కల్లపల్లి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.