Take a fresh look at your lifestyle.

పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్.

మోత్కూర్ ముద్ర న్యూస్:

మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో పారిశుద్ధ్య పనులను నూతన చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోత్కూర్ని ఆదర్శం మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, గుడ్లపై ఉన్నటువంటి చెత్తలను వెంటనే తొలగించాలని ఆమె అన్నారు. పారిశుద్ధ సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పారిశుద్ధ కార్మికులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.