Take a fresh look at your lifestyle.

నేడు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ.. -విజయోత్సవ ర్యాలీ

మోత్కూర్ ముద్ర న్యూస్:

నేడు నూతనంగా ఎన్నికైన మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు బాధ్యతల స్వీకరణతో పాటు కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హాజరై వారి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్,మరియు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఎమ్మెల్యే గారితో కలిసి నూతన చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్ల విజయోత్సవ ర్యాలీ, చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుంది. సభలో ముఖ్యులు మాట్లాడతారు. అనంతరం స్థానిక ఎల్ ఎన్ గార్డెన్స్ లో కార్యకర్తలకు నాయకులకు భోజన ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్,SC సెల్, ఎస్టి సెల్, బి సి విభాగం, ఐ ఎన్ టి యు సి మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.