Take a fresh look at your lifestyle.

161 జాతీయ రహదారిపై జింక మృతి

 
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి.
చౌటకూర్ మండలం, సుల్తాన్పూర్, శివారులో గల సంగారెడ్డి నాందేడ్ అకోలా 161 జాతీయ రహదారిపై జింక మృతి చెందింది. సుల్తాన్పూర్ గ్రామ సమీపంలోని డిఎస్ దాబా ఎదురుగా పెద్ద చెరువు వైపు నుండి రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని ఉంటుందని అటవీశాఖ సిబ్బంది భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతం లో జింకలు, దుప్పిలు గణనీయ సంఖ్యలో సంచరిస్తున్నాయి. మేత కోసం చెరువు వైపు నుండి కోర్పోలు వైపునకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లుగా తెలుస్తుంది.ప్రమాద దాటికి జింక ఎగిరి జాతీయ రహదారి మధ్య పూల మొక్కల్లో పడింది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే జింక కళేబరం ఉబ్బిపోయింది అంటున్నారు. కాగా జింక మృతి చెందిన విషయాన్ని సంగారెడ్డి అటవిశాఖ సిబ్బందికి సమాచారం అందించగా,జింక కళేబరాన్ని పరిశీలించారు. మండల పశువైద్యాధికారి డాక్టర్ విశాల్ జింకకు పోస్టుమార్టం నిర్వహించి జాతీయ రహదారి పక్కనే పాతిపెట్టారు. ఉప్పరిగుడెం ,బొమ్మరెడ్డి గూడెం, గో0గులూరు పరిసర గ్రామాల పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ ఉండటంతో తరచుగా జింకలు దుప్పిలు మైదాన ప్రాంతంలో సంచరిస్తూ ప్రమాదాలకు గురవుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.