- యెన్కెపల్లి లో రేషన్ దుకాణంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు.
- కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షుడు తమాలి మణేయ్య & యెన్కెపల్లి గ్రామ అధ్యక్షులు న్యాలటి రాజేష్.
ముద్ర మొయినాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేద ప్రజలకు న్యాయం పేదలకు సన్న బియ్యం పథకం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఇచ్చే దొడ్డు బియ్యంకు బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమాన్ని మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని యెన్కెపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తమాలి మణేయ్య మరియు గ్రామ అధ్యక్షులు న్యాలటి రాజేష్ ఆధ్వర్యంలో సన్న బియ్యం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మణేయ్య మాట్లాడుతూ..శ్రీమంతులు తినే సన్న బియ్యం ఇకపై పేదలు సైతం తింటారని అధ్యక్షులు మణేయ్య పేర్కొన్నారు, తెలంగాణ వ్యాప్తంగా అర్హులందరికీ తన ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుంది అని తెలిపారు, రేషన్ కార్డులోని ఒక్కొక్క సభ్యునికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తామని తెలిపారు, పేదలకు కడుపునిండా అన్నం పెట్టేందుకే ఈ సన్న బియ్యం పథకం అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.ఇది తెలంగాణ ప్రజల అదృష్టమని ఆయన అభివర్ణించారు, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన సన్న బియ్యం పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు, ఈ కార్యక్రమంలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కావాలి రమేష్ ముదిరాజ్, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు తలారి భిక్షపతి,యెంగని యాదయ్య,మాజీ సర్పంచ్ న్యాలాటి చందన చంద్రయ్య చేవెళ్ళ రవీందర్,అల్లం వెంకటేష్ గౌడ్,ఈదులకంటి వెంకటేష్ ,న్యాలాటి చిట్టిబాబు,అల్లం సత్యనారాయణఏల్గాని సురేష్ జెల్లెల్ల మహిపాల్ యాదవ్ ,ఈదులకంటి కుమార్ బత్తుల ప్రభాకర్ గౌడ్,చేవెళ్ళ అనిల్, యెంగని మల్లేష్, తదితరులు పాల్గొన్నారు,