ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ పట్టణంలో గత 24 సంవత్సరాలుగా 5వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మిథిలా విద్యాలయం-ఆత్రి (జగద్గురు పీఠం) నిర్వాహకులు తెలిపారు.

ఈ విద్యాసంస్థలో ఉన్నత ప్రమాణాలతో విద్య బోధనతో పాటు సంస్కారం, భారతీయ జీవన విధానాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు మంచి విలువలను అలవర్చుకోవడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని వివరించారు.
కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని, ఆసక్తి గల తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ విద్యాసంస్థలో చేర్పించుకోవాలని సూచించారు.
అడ్మిషన్లకు సంబంధించిన వివరాల కోసం 08540 224000, 9493450061, 9491629229 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.